వైసీపీ ఎమ్మెల్సీ జంగా పై సస్పెన్షన్ వేటు.. అదే కారణమా?
వైయస్సార్సీపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటుపడింది. శాసనమండలి చైర్మన్ నిజంగా కృష్ణమూర్తిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈయనని ఇలా సస్పెండ్ చేయడానికి కారణం...
వైయస్సార్సీపి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పై అనర్హత వేటుపడింది. శాసనమండలి చైర్మన్ నిజంగా కృష్ణమూర్తిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఈయనని ఇలా సస్పెండ్ చేయడానికి కారణం లేకపోలేదు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొంది అనంతరం టీడీపీలోకి వెళ్లిపోయారు.
ఇలా ఒక పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఈయన మరో పార్టీలోకి వెళ్లడంతో ఈయనపై శాసనమండలి చైర్మన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. జంగా కృష్ణమూర్తి పై వైసీపీ విప్ లేళ్ళ అప్పి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై విచారణ జరిపినటువంటి శాసనమండలి చైర్మన్ మోషేను రాజు ఇలా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి ఫీటాయింపులు నిరోధ చట్టం కింద ఈయనని సస్పెన్షన్ చేశారు.
ఇలా ఈయనని సస్పెన్స్ చేయడమే కాకుండా అర్థరాత్రి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సిపి పార్టీలో ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పార్టీకి వ్యతిరేకంగా మారడంతో పలువురు నేతలపై ఇలాంటి చర్యలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.
వైసీపీ ఎమ్మెల్సీ ఫై వేటు
— Anitha Reddy (@Anithareddyatp) May 16, 2024
టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు.
వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు.
దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్ మోషేనురాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన… pic.twitter.com/gZJdzUr9lp