వేలికి బదులు నాలుకకి శస్త్ర చికిత్స...వైద్యుడి నిర్లక్ష్యంతో ముగబోయిన చిన్నారి గొంతు
విశ్వంభర, వెబ్ డెస్క్ : ఓ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ముద్దు ముద్దు మాటలు మాట్లాడే నాలుగేళ్ల చిన్నారి గొంతు మూగబోయింది. తన వేలికి సర్జరీ చేయించడానికి తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకురాగా.. ఎలాంటి సమస్య లేని నాలుక కి సర్జరీ చేశాడు ఓ వైద్యుడు.. ఈ ఘటన కేరళలోని కోజికోడ్ లో చోటు చేసుకుంది. ఆమె చేతికి ఉన్న ఆరోవేలుని తొలగించడానికి తల్లిదండ్రలు ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ఆపరేషన్ థియేటర్ నుంచి వచ్చిన తమ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆగ్రహంతో ఏం జరిగిందని ప్రశ్నించగా... బాలిక నాలుగపై తిత్తి ఉందని అందువల్లనే నాలుకను తొలగించినట్లు చెప్పాడు వైద్యుడు. అసలు ఆమె నాలుకకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేవని తల్లిదండ్రులు తెలిపారు. ఒకే రోజు రెండు సర్జరీలు జరగడంతో ఈ పొరపాటు జరిగిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు చైల్డ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించడంతో కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణ జార్జ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి జోన్ జాన్సన్ ను సస్పెండ్ చేశారు. ఏది ఏమైనా డాక్టర్ అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ చిన్నారికి ఈ ప్రమాదం తప్పి ఉండేది.