రాజ్యాగం రద్దు చేయాలంటే 400 సీట్లు అవసరం లేదు...అమిత్ షా షాకింగ్ కామెంట్స్
విశ్వంభర, వెబ్ డెస్క్ : 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని విపక్షాలు ఆరోపిస్తున్నాయని, పెద్ద నిర్ణయాలు తీసుకోవాలంటే తమకు 400 సీట్లే అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుండబద్దలు కొట్టారు. 400 సీట్లు లేకున్నా ఆర్టికల్ 370 రద్దు చేశామని గుర్తు చేశారు. పదేళ్లలో ట్రిపుల్ తలాక్ రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించామని తెలిపారు. తమ పార్టీని విస్తరించడానికే 400 సీట్ల నినాదం అని క్లారిటీ ఇచ్చారు.
ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీని దుర్వినియోగం చేసిందని, మోజార్టీని దుర్వినియోగం చేసిన ఘనత కాంగ్రెస్ కే చెందుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగంలోని అధికరణాలను మార్చారు, లోక్ సభ పొడిగించారు, చివరకు ఎమర్జెన్సీని కూడా విధించారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఏ కారణం లేకుండానే లక్షా పాతిక వేల మందిని జైళ్లో వేశారని ఫైర్ అయ్యారు. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చామని, 400 సీట్లు లేకున్న సాధారణ మెజార్టీతోనే ఇవన్నీ చేశామని పేర్కొన్నారు.