పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ

పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే రాహుల్ కు 3 రోజుల పోలీస్ కస్టడీ

లైంగిక దాడి ఆరోపణల కేసులో చిక్కుకున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట‌తిల్‌ను విచారణ నిమిత్తం తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: లైంగిక దాడి ఆరోపణల కేసులో చిక్కుకున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట‌తిల్‌ను విచారణ నిమిత్తం తిరువల్ల జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న బాధితురాలి ఫిర్యాదుతో నమోదైన ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సిద్ధమైంది. పోలీసులు మొదట ఏడు రోజుల కస్టడీ కోరినప్పటికీ, వాదనలు విన్న అనంతరం కోర్టు కేవలం మూడు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా సాక్ష్యాలను సేకరించాలని, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు.

రాజకీయ వేటు..
2024 ఏప్రిల్ లో ఒక హోటల్‌లో తనపై ఎమ్మెల్యే రాహుల్ అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.

Read More చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం

ఆందోళనల మధ్య కోర్టుకు..
తిరువల్ల తాలుకా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యేను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో DYFI, SFI, యువ మోర్చా కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్న మూడు రోజుల పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ బాధితురాలు పేర్కొన్న ప్రదేశాలకు ఎమ్మెల్యేను తీసుకెళ్లి విచారించనుంది. నిందితుడి ఫోన్ డేటా, ఇతర ఫోరెన్సిక్ ఆధారాలను కూడా పోలీసులు పరిశీలించనున్నారు.