'హాజరు' వార్తల్లో నిజం లేదు: డి.సురేష్ బాబు
దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న కొన్ని వార్తా కథనాలను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు. జనవరి 23న దగ్గుబాటి కుటుంబం కోర్టుకు హాజరు కావాలి" అంటూ ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవి పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు.
విశ్వంభర బ్యూరో: దగ్గుబాటి కుటుంబంపై వస్తున్న కొన్ని వార్తా కథనాలనుతీవ్రంగా ఖండించారు. జనవరి 23న దగ్గుబాటి కుటుంబం కోర్టుకు హాజరు కావాలి" అంటూ ప్రచురితమైన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవి పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అధికారిక న్యాయ రికార్డులను వక్రీకరించి, ప్రజలను తప్పుదారి పట్టించేలా సదరు ఇంగ్లీష్ దినపత్రిక కథనాన్ని అల్లడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది..?
నవంబర్ 14, 2025న XVII అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (హైదరాబాద్) ఇచ్చిన ఉత్తర్వులో భాగంగా వ్యక్తిగతంగా తమను హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొందన్నారు. తనపై కానీ, తన కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. జనవరి 9, 2026న జరిగిన విచారణ కేవలం 'క్రిమినల్ మిసిలేనియస్ పిటిషన్ల' పరిష్కారం కోసమే తప్ప, వ్యక్తిగత హాజరు కోసం కాదని ఆయన వివరించారు. స్పష్టమైన న్యాయపరమైన రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం సంచలనం కోసం వాస్తవాలను వక్రీకరించడంపై సురేష్ బాబు మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కథనాల వల్ల వ్యక్తుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము చట్టాన్ని గౌరవిస్తామని, న్యాయ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నామని, వాస్తవాలు తెలుసుకోకుండా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు మాకు ఉందన్నారు.



