surya44: బంపరాఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ.. అండమాన్ దీవుల్లో షూటింగ్..!

surya44: బంపరాఫర్ కొట్టేసిన బుట్టబొమ్మ.. అండమాన్ దీవుల్లో షూటింగ్..!

తాజాగా బుట్టబొమ్మకు బంపరాఫర్ దక్కింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ‘సూర్య 44’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లిన పూజాహెగ్దేకు ఇటీవల సరైన హిట్ లేక నిరాశలో ఉంది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో చేతికందిన సినిమాలు చేజారిపోయాయి. ఇలాంటి సమయంలో బుట్టబొమ్మ పూజాహెగ్దే సౌత్‌లో సినిమాలు చేయడం మానేసి బాలీవుడ్ బాటపట్టింది. ఈ క్రమంలో సౌత్‌తో కమ్ బ్యాక్ ఇవ్వడానికి పూజా ఆతృతగా ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు బంపరాఫర్ దక్కింది. 

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ‘సూర్య 44’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. పూజా హెగ్దే, సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్ జూన్ 2న అండమాన్ దీవుల్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అండమాన్ దీవులు, ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను టీమ్ ప్లాన్ చేసింది. 

ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 2డి ఎంటర్టైన్మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారు. పూజా చివరగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో నటించింది. ఈ సినిమా హిట్ అయితే పూజాహెగ్దేకు సౌత్‌తో మరిన్ని సినిమాలో నటించే అవకాశముంది.

Related Posts