ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

2027 మార్చి 5న థియేటర్లలోకి సందీప్ వంగా

ప్రభాస్ ‘స్పిరిట్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది.

విశ్వంభర, సినిమా బ్యూరో:  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ విడుదల తేదీ ఖరారు అయ్యింది. సంక్రాంతి పండుగ కానుకగా చిత్ర యూనిట్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌ను 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ అకాడమీ టాపర్ అయిన ఒక పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారిగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘సౌండ్ స్టోరీ’ ఆడియో టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఒక పోలీసు అధికారి రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లడం, అక్కడ జైలర్ ప్రకాష్ రాజ్‌తో జరిగే సంభాషణలు సినిమాలోని డ్రామాను హైలైట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు చూడని ఒక ‘సరికొత్త’ కోపంలో ప్రభాస్‌ను సందీప్ వంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో పోలీసు కథతో పాటు అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యం కూడా ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా ద్వితీయార్ధంలో వచ్చే సీన్లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని, ఆ మలుపులే సినిమాకు ప్రాణమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Read More ఎస్వీ కృష్ణారెడ్డి 43వ సినిమా "వేదవ్యాస్" ఎనౌన్స్

ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం లుక్ తర్వాత, ఇప్పుడు విడుదల తేదీ కూడా రావడంతో సోషల్ మీడియాలో 'స్పిరిట్' ట్రెండింగ్ మొదలైంది. ప్రభాస్ మార్క్ మాస్ యాక్షన్, సందీప్ వంగా స్టైల్ ఇంటెన్సిటీ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.