Rashmika Mandanna: అటల్ సేతు వంతెనపై రష్మిక వీడియో.. స్పందించిన ప్రధాని మోదీ..! 

Rashmika Mandanna: అటల్ సేతు వంతెనపై రష్మిక వీడియో.. స్పందించిన ప్రధాని మోదీ..! 

అటల్ సేతు వంతెనపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. ముంబై రవాణా వ్యవస్థ తీరును మార్చేసిన గేమ్ ఛేంజర్ అని అభివర్ణించింది. 

 

ముంబైని, నవీ ముంబైతో కలుపుటూ 22 కిలోమీటర్ల మేర సముద్రంపై నిర్మించిన అత్యంత పొడవైన వంతెనగా ‘అటల్ సేతు’ నిలిచింది. తాజాగా ఈ వంతెనపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రశంసలు కురిపించింది. ముంబై రవాణా వ్యవస్థ తీరును మార్చేసిన గేమ్ ఛేంజర్ అని అభివర్ణించింది. 

ఈ మేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. ‘‘ఒకప్పుడు రెండు గంటలుగా ఉన్న ప్రయాణ సమయం 20నిమిషాలకు తగ్గిపోయింది. ఇది అస్సలు నమ్మశక్యంగా లేదు. అసలు ఇలాంటిది సాధ్యమని ఎవరైనా ఊహించారా? ముంబై నుంచి నవీ ముంబై వరకూ, ముంబై నుంచి బెంగళూరు వరకూ, గోవా నుంచి ముంబై వరకూ అద్భుత మౌలిక సదుపాయాల కల్పనతో ప్రతీ ప్రయాణం సులువుగా సౌకర్యవంతంగా మారిపోయింది’’ అంటూ రష్మిక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. 

Read More ఎంపీ వద్దిరాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం సమర్పణ

దీనికి సంబంధించిన వీడియోను రష్మిక తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించిన రష్మిక పోస్ట్‌ను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘‘కచ్చితంగా..‌!’’ అని రాశారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడం కంటే సంతృప్తినిచ్చేది మరొకటి లేదని పేర్కొన్నారు.