రేవ్‌పార్టీ: నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌

రేవ్‌పార్టీ: నా విషయంలో నిరుత్సాహపడ్డారేమో: నవదీప్‌

ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నాడు. 'ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపాడు.

ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని నటుడు నవదీప్ అన్నాడు. 'ఏంటన్నా.. ఈసారి నువ్వు ఫేక్ న్యూస్‌లో కనిపించడంలేదు' అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపాడు. తన కొత్త సినిమా 'లవ్ మౌళి' ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్‌మీట్‌లో రేవ్ పార్టీ గురించి ప్రశ్నకు నవదీప్ స్పందించాడు. 

అదేవిధంగా కొవిడ్ టైమ్‌లో ప్రేక్షకులకు 'ఓటీటీ' బాగా దగ్గరైందని నవదీప్ తెలిపాడు. ఇంట్లో కూర్చొనే అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారని అన్నాడు. విజువల్ ఫీస్ట్ అనిపించే అగ్ర హీరోల సినిమాలు చూసేందుకు తప్ప థియేటర్లకు వెళ్లే పరిస్థితి లేదన్నాడు. థియేటర్లలో విడుదలైన రెండు, మూడు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తాయని ఆడియన్స్ భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే, తన చిత్రం విషయానికొస్తే.. దాని నిర్మాణం ఎలా జరిగిందన్న దానిపై ఓ సినిమా తీయొచ్చని తెలిపాడు. చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని పేర్కొన్నాడు. 

మరోవైపు ‘చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏదైనా అంశం సంచలనంగా మారితే.. మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు’ అంటూ ఓ విలేకరి ప్రశ్నించగా.. మంచే జరిగిందని, ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ చెప్పాడు. రేవ్ పార్టీ అంటే.. రేయి, పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపాడు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని వివరించాడు.

Related Posts