వేసవిలో నవ్వుల విందు.. హవీష్ ‘నేను రెడీ’ టీజర్ విడుదల
‘రాజా సాబ్’ థియేటర్లలో సందడి చేస్తున్న టీజర్
యంగ్ హీరో హవీష్, మాస్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
విశ్వంభర సినిమా, బ్యూరో: యంగ్ హీరో హవీష్, మాస్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’. హర్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’ థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శిస్తుండగా, సోషల్ మీడియా వేదికగా కూడా దీనికి విశేష స్పందన లభిస్తోంది.
టీజర్ విషయానికి వస్తే..
ఇదొక సరదా సంసారాల మధ్య జరిగే ‘కల్చర్ క్లాష్’గా కనిపిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన మధ్యతరగతి ఆంధ్ర అబ్బాయి (హవీష్), ఒక పక్కా తెలంగాణ అమ్మాయి (కావ్య థాపర్) నిశ్చితార్థం చేసుకుంటారు. పెళ్లి కొడుకు వైపు వారు పక్కా వెజిటేరియన్స్ కాగా, పెళ్లి కూతురు వైపు వారు మాంసాహారం (నాన్-వెజ్) అంటే ప్రాణం ఇచ్చే రకం. ఈ రెండు భిన్నమైన కుటుంబాల మధ్య చోటుచేసుకునే సరదా సంఘటనలు, గొడవలను త్రినాధరావు తనదైన శైలిలో నవ్వులు పూయించేలా రూపొందించారు. చాలా కాలం తర్వాత హవీష్ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి యువకుడిగా, బాధ్యత గల కొడుకుగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. నిజాం అమ్మాయిగా కావ్య థాపర్ గ్లామర్, నటనతో మెరిసింది. వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, శ్రీలక్ష్మి, వెన్నెల కిషోర్, విటివి గణేష్ వంటి దిగ్గజ కామెడీ నటులు ఉండటంతో వినోదానికి లోటు ఉండదని అర్థమవుతోంది. మురళీ శర్మ, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ అందించిన నేపథ్య సంగీతం ఉత్సాహంగా ఉండగా, నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా రిచ్‌నెస్‌ను చాటిచెబుతున్నాయి. మొత్తానికి, 2026 వేసవి విడుదలకు సిద్ధమవుతున్న ‘నేను రెడీ’ బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించేలా కనిపిస్తోంది.



