తండ్రి బాటలోనే తనయుడు.. స్టేజి ఫెర్ఫామెన్స్ అదరగొట్టిన గౌతమ్
- లండన్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ
- గౌతమ్ తొలి థియేటర్ స్టేజి పెర్ఫామెన్స్
- ఫొటోలు షేర్ చేసిన నమ్రత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ తన మొదటి స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లండన్ యూనికార్న్ థియేటర్‌లో గౌతమ్ తన పెర్ఫార్మెన్స్ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ పర్ఫామెమ్స్ చూసేందుకు మహేశ్ ఫ్యామిలీ లండన్ చేరుకుంది. ఈ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
‘ఇదొక ప్రత్యేకమైన సాయంత్రం. గౌతమ్ ఘట్టమనేనిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. లండన్ వేదికగా తన తొలి థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా బాగా అనిపించింది. లవ్ యూ మోర్ నాన్నా. చిన్నారులంతా ఈ సమ్మర్ ప్రోగ్రామ్లో పాల్గొని తమతమ టాలెంట్ ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని ఆకాంక్షిస్తూన్నా. స్పెషల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య సంతోషంగా, హాయిగా అనిపించింది’ అని నమ్రత పోస్ట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
గౌతమ్ సిల్వర్ స్క్రీన్‌పై మెరిసే అవకాశాలు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబుతో కలిసి ‘1 నేనొక్కడినే’ సినిమాలో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై దృష్టిపెట్టాడు. ఇటీవలే ప్లస్ టూ పూర్తి చేసిన గౌతమ్ యాక్టింగ్ కోర్సులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక మహేశ్ గారాల పట్టి సితార కూడా సినిమాల్లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలు ప్రకటనల్లోనూ మెరిసిందీ స్టార్ కిడ్. మొత్తానికి మహేష్ వారసులిద్దరూ సినిమాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది.
https://www.instagram.com/p/C8ifCVuikt4/?utm_source=ig_embed&ig_rid=be448b35-0274-482f-b18d-5b77f44c907b&img_index=7