బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ క్లారిటీ..!

బెంగళూరు రేవ్ పార్టీలో నేను లేను.. నటి హేమ క్లారిటీ..!

బెంగళూరులో ఆదివారం రాత్రి ఓ రేవ్ పార్టీ జరిగినట్లు, ఇందులో టాలీవుడ్ నటీనటులు ఉన్నారని, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో నటి హేమ ఈ వార్తలను ఖండిస్తూ ఇవాళ(సోమవారం) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

బెంగళూరులో ఆదివారం రాత్రి ఓ రేవ్ పార్టీ జరిగినట్లు, అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కన్నడ పోలీసులు బెంగుళూరులో ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ప్రస్తుతం ఆ రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పాలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలిస్తున్నారు.ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ఈ పార్టీకి దాదాపు 100మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ పార్టీలో వివిధ రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో టాలీవుడ్ నటీనటులు ఉన్నారని, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో నటి హేమ ఈ వార్తలను ఖండిస్తూ ఇవాళ(సోమవారం) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read More పంట కొంటారా? కొనరా? 

హేమ మాట్లాడుతూ.. ‘నేను ఎక్కడికీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నా. నా ఫామ్ హౌజ్‌లోనే ఎంజాయ్ చేస్తున్నా. నాకు బెంగళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలాంటి వార్తలను నమ్మకండి. అవన్నీ ఫేక్ న్యూస్’ అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.