మెట్ పల్లి లో రాపోలు వీర మోహన్ కు ఆత్మీయ స్వాగతం

మెట్ పల్లి లో రాపోలు వీర మోహన్ కు ఆత్మీయ స్వాగతం

విశ్వంభర, జగిత్యాల జిల్లా :-మెట్ పల్లిలో స్థానిక పద్మశాలి ప్రముఖులు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ కు  స్వాగతం పలికి ఆత్మీయ సన్మానం చేశారు. కోరుట్ల లో శ్రీవారి కళ్యాణ మహోత్సవం లో పాల్గొని శ్రీ జడల ప్రభాకర్ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి చైర్మన్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా పుర ప్రముఖులు విచ్చేసి పలు విషయాలపై అలాగే పద్మశాలి ల రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలనీ , చేనేత కార్మికుల అభ్యున్నతికి పాటు పడేవిధంగా చర్యలు చేపట్టాలని కోరారు . వచ్చే నెలలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సర్పంచ్ ,  ఉప సర్పంచ్ లకు జరిగే సన్మాన సభ గూర్చి చర్చించడం జరిగింది. తప్పకుండ ఆ యొక్క సభకు ప్రతిఒక్కరికి ఆహ్వానం అందిస్తామని అందరు హాజరు అయ్యి విజయవంతం చేయాలనీ కోరారు. 

Tags: