పవన్ కల్యాణ్ భార్యల గురించి మీకెందుకు.. హీరో సుమన్ ఫైర్
సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా ఓ ప్రోగ్రామ్ లో మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై స్పందించారు. ఏపీలో ఎన్నికల సందర్భంగా పవన్ కల్యాణ్ భార్యల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కొందరు తప్పుగా మాట్లాడారని ఫైర్ అయ్యారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు నటుడు సుమన్. ఒక వ్యక్తి ఎన్ని పెళ్లిల్లు చేసుకుంటే మీకెందుకు.. అది ఆయన వ్యక్తిగతం. కాబట్టి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు అతన్ని బాధపెట్టే విధంగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
ఇక రోజా గురించి కూడా తనకు బాగా తెలుసన్నారు. ఆమె మీద కూడా కొందరు బ్యాడ్ కామెంట్స్ చేశారని.. ఒక మహిళ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుందని.. ఎన్నో దాటుకుని రోజా స్టార్ అయిందని తెలిపారు. ఇక మీదట అయినా వారి మీద వ్యక్తిగత విమర్శలు మానేయాలంటూ హితవు పలికారు సుమన్.