ట్రంప్ బయోపిక్ లో విస్తుపోయే విశేషాలు...అన్ని కల్పితమని కొట్టిపరేస్తున్నా ట్రంప్ వర్గాలు
విశ్వంభర, వాషింగ్టన్ : శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్ ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఇటీవల ట్రంప్ బయోపిక్ ప్రీమియర్ షో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. " ది అప్రెంటిస్ ' పేరిట వచ్చిన ఈ చిత్రం పై ట్రంప్ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని వెల్లడించాయి.
చాలా సన్నివేశాలు కల్పితాలు అనే డిస్ క్లెయిమర్ తోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమీక్షకులు పేర్కొన్నారు.1970 ,1980లలో ట్రంప్ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని... మాజీ అధ్యక్షుడు ప్రతిష్థను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది.
దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. హాలీవుడ్ లోని ప్రముఖులు పన్నిన కుట్రగా అభివర్ణించింది. మారో వైపు నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ చిత్రం తెరపైకి రావడం గమనార్షం.