ఇంటర్నెట్ సేన్సేషనల్ డాగ్ కబోసు మృతి!
పాపులర్ మీమ్ డాగ్ కబోసు మృతిచెందింది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మృతిచెందినట్లు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది
పాపులర్ మీమ్ డాగ్ కబోసు మృతిచెందింది. గత కొన్ని రోజులుగా లుకేమియాతో బాధపడుతున్న కబోసు మృతిచెందినట్లు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. కాగా, ప్రపంచంలో సంచలనం సృష్టించిన కబోసు.. సోషల్ మీడియాలో 'వైరల్ డాగీ'గా పేరు పొందింది. క్రిప్టో కరెన్సీ డాగీకాయిన్ లోగోలోనూ దీని ఫొటో ఉండేది.
మీమ్ ప్రపంచంలో భారతీయ నెటిజన్లకు ‘చిమ్‌టూ’గా ఈ శునకం సుపరిచితం. ఈ శునకం థీమ్‌తో రూపొందించిన మీమ్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా క్రికెట్, సినిమా, రాజకీయాలు, యూత్ అంశాలు, భార్యాభర్తలు, ప్రేమికుల జోక్స్‌ను చిమ్‌టూ ఫొటోలతో మీమర్స్ రూపొందించేవారు. పలు సోషల్ మీడియా యాప్‌లు సైతం ప్రత్యేకంగా చిమ్‌టూ స్టిక్కర్లను తీసుకొచ్చాయి.
అదేవిధంగా చిమ్‌టూ మృతిపట్ల డాగీకాయిన్ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘తమ కమ్యూనిటీ భాగస్వామి, స్నేహితురాలు కబోసు ప్రశాంతంగా కన్నుమూసింది. అపరిమితమైన సంతోషం, ప్రేమకు కబోసు చిరునామా. మీమ్ వరల్డ్‌లో తనదైన ముద్రవేసింది. అది ఎప్పుడూ మీ గుండెల్లో నిలిచిపోతుంది’. అని డాగీకాయిన్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.