కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన అనసూయ
భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ కేటగిరీలో ఉత్తమ నటిగా అనసూయ అవార్డు అందుకుంది.
భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా చరిత్ర సృష్టించింది. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ కేటగిరీలో ఉత్తమ నటిగా అనసూయ అవార్డు అందుకుంది. ‘ది షేమ్‌లెస్’ అనే చిత్రానికి ఆమె ఈ అవార్డు అందుకోగా.. ఈ ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫెస్టివల్‌లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించింది.
‘ది షేమ్‌లెస్’ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని బల్గేరియన్ దర్శకుడు కాన్‌స్టాంటిన్ బొజనోవ్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అనసూయ ‘రేణుక’ అనే వేశ్య పాత్రలో నటించింది. ఢిల్లీలో గల ఓ బ్రోతల్ హౌస్‌లో ఉన్న రేణుక అనుకోకుండా అక్కడకు వచ్చిన పోలీసును చంపి పారిపోతుంది. ఇక అక్కడ నుంచి రేణుక ఒక సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడుతుంది. ఈ క్రమంలోనే వారికి ఎదురైన అడ్డంకులు ఏంటి.. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
మరోవైపు ఫ్రాన్స్‌లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ సందడి చేస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌లను ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలు పోతున్నారు. కాగా, ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో మలయాళీ చిత్రం ‘ఆల్ వీ ఇమాజైన్ యాజ్ లైట్’ పోటీలో నిలిచింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీలో నిలవడం విశేషం.
This way! This way! To the left! 📸 Par ici ! De ce côté ! À gauche !
— Festival de Cannes (@Festival_Cannes) May 17, 2024
THE SHAMELESS – KONSTANTIN BOJANOV
Avec l’équipe du film / With the film crew
🔎 Anasuya Sengupta, Konstantin Bojanov, Omara Shetty, Rohit Kokate, Kiran Bhivagade, Auroshikha Dey, Mihir, Mita Vashisht, Tanmay… pic.twitter.com/vyjg9PB0Op