26 ఏళ్లుగా కిడ్నాప్ కు గురై సోషల్ మీడియా కారణంగా బయటపడిన యువకుడు

26 ఏళ్లుగా కిడ్నాప్ కు గురై సోషల్ మీడియా కారణంగా బయటపడిన యువకుడు

విశ్వంభర, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మిస్టరీగా మారిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కొన్ని సంబంధాలను దూరం చేస్తే మరెన్నో బంధాలను దగ్గరికి చేసిన సందర్భాలు అనేకం ఉన్నయని చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియా కారణంగా 26 ఏళ్లుగా బందిగా ఉన్న వ్యక్తికి  విముక్తి కలిగిన సంఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తర అల్టీరియాలోని డెజెల్ఫా అనే ఊరిలో 1998లో ఒమర్ బిన్ బమ్రాన్ అనే 19 ఏళ్ల కుర్రాడు కిడ్నాప్ కి గురయ్యాడు. అతని ఆచూకీ కోసం తన కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినప్పటికి కుర్రాడి ఆచూకీ తెలుసుకోలేకపోయారు. పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినప్పటికి అతని ఆచూకీ దొరకలేదు. ఓ రోజు ఒమ్రాన్ పెంపుడు కుక్క పొరుగింటి వద్ద వాసన చూస్తూ తిరిగింది. అయినప్పటికి కుటుంబ సభ్యులు తేలిగ్గా తీసుకున్నారు.

Read More పాకిస్తాన్‌కు ర‌క్త‌క‌న్నీరు

ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఉన్నట్టుండి పెంపుడు కుక్క కూడా మరణించింది. అప్పటీకే దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం జరుగుతుండటంతో ఒమ్రాన్ కుటుంబం అతని పై ఆశలు వదులుకుంది. ఒమ్రాన్ కోసం ఎదురు చూస్తున్న తల్లి సైతం 2013లో మరణించింది. కిడ్నాప్ చేసిన వ్యక్తి సోదరుడు సోషల్ మీడియాలో తన సోదరుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడని పోస్ట్ చేశాడు.దీంతో ఒమ్రాన్ కుటుంబ సభ్యులు అలర్ట్ అయ్యారు.

వెంటనే పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కేసు ను రీ ఓపెన్ చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో అధికారలు పొరుగింటి పై దాడులు చేయగా.. గొర్రెల కొట్టం క్రింద సెల్లార్ లో ఒక వ్యక్తి ఉన్నట్లు గ్రహించారు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఒమ్రాన్ కనిపించాడు. అతను దాదాపు 26 ఏళ్లుగా అక్కడే ఉన్నట్లు అధికారులకు వివరించాడు.

అంతే కాకుండా తన కుటుంబ సభ్యులు దారిలో వెళ్తుంటే అప్పుడప్పుడు కనిపించేవారని, గట్టిగా పిలుద్దాం అంటే పక్కనే కిడ్నాపర్ లు ఉండేవారని తెలిపాడు. అధికారులు 64 ఏళ్ల వయసున్న కిడ్నాపర్ పారిపోతుండగా అరెస్ట్​ చేశారు. పెంపుడు కుక్కను సైతం అతనే చంపి ఉంటడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts