ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం

ఏపీలో జనసేన సంచలనం...అన్ని స్థానాల్లో ఆధిక్యం

విశ్వంభర,ఏపీ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ సంచలనం సృష్టిస్తుంది. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం లక్ష్యంగా చేసుకుని టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్.. తాను అనుకున్నది సాధించారు. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా తనకు వచ్చిన సిట్లను బీజేపీకీ త్యాగం చేసిన జనసేన కేవలం 21 అసెంబ్లీ 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో జనసేన తాను పోటీలో ఉన్న 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.

దీంతో మొదటి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న స్థానల సంఖ్య కంటే 100 ఫలితం ముఖ్యం అని తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన పిలుపు నిజమైనట్లు తెలుస్తుంది. కాగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 30 వేల పైచిలుకు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో గతంలో తాను పోటీ చేసి రెండు స్థానాల్లో ఓడిపోయిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రతి ఒక్కరిని గెలిపించుకునే స్థాయికి పవన్ కళ్యాణ్, జనసేన చేరిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read More BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా