జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు 

జులై 15 నుంచి దశలవారీగా రుణమాఫీ... ప్రభుత్వం కసరత్తు 

రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రైతు రుణమాఫీపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ చెల్లింపును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రూ. 2లక్షల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. 

జులై 15 నుంచి రూ. 50వేల లోపు, ఆ తర్వాత రూ. 75వేలు,  రూ. లక్ష.. ఇలా పెంచుతూ బ్యాంకులకు జమ చేసే విధానాన్ని పరిశీలిస్తోంది. రైతుల్లో 70 శాతం మందికి రూ. లక్ష లోపు రుణం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. తొలి దశలో వీరికి మాఫీ చేసి మిగిలినవారికి ఆగస్టు 15లోగా జమ చేయాలనే అంశంపైనా చర్చ సాగుతోంది. అయితే, నిధుల లభ్యతపై స్పష్టత వచ్చాక అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలవనున్నట్లు సమాచారం.

Read More  మహనీయులకు నివాళులు -  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు