ఆర్టీసీ బస్సుకింద పడి యువతి దుర్మరణం..!
కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. సదరు యువతి ఫుట్ బోర్డుపై ఉండగా జారిపడింది. దీంతో బస్సు టైరుకింద పడి అక్కడికక్కడే మృతిచెందింది.
ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తున్న ఓ యువతి బస్సుకింద పడి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్లలో ఘోర ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం ఓ యువతి ఆర్టీసీ బస్సు ఎక్కింది. సదరు యువతి ఫుట్ బోర్డుపై ఉండగా జారిపడింది. దీంతో బస్సు టైరుకింద పడి తీవ్రగాయాలపాలైంది. బస్సు డ్రైవర్ గమనించి బస్సును వెంటనే నిలిపివేశాడు. అయితే, అప్పటికే ఆ యువతి అక్కడికక్కడే మృతిచెందింది.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ప్రమాదస్థలి వద్ద జనం గుమిగూడారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడి నుంచి రాకపోకలను నిలిపివేశారు. అటుగా వెళ్లే వాహనాలను ఇతర మార్గంలో మళ్లిస్తున్నారు.