రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన

రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. శవం పక్కన రెండేళ్ల కొడుకు రోదన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఐనాంగూడా దగ్గర ఘోరరోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైకును డీసీఎం వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై తన రెండేళ్ల కొడుకు ఉన్నాడు. కళ్లెదుటే తండ్రి చనిపోవడం.. చుట్ట జనాలు రావడం.. రక్తం మడుగులో పడి ఉండటం చూస్తే అక్కడ ఏం జరుగుతుందో ఆ రెండేళ్ల చిన్నారికి అర్థం కాలేదు. ఏ చేయాలో తెలియక రెండేళ్ల బాబు కన్నీరుమున్నీరు అవుతున్నాడు. దిక్కుతోచని స్థితిలో ఏడుస్తున్న బాబును చూసిన వారికి కూడా కన్నీళ్లు ఆగలేదు. 

 

Read More మహాదేవపూర్ నేత కార్మికునికి రాష్ట్రస్తాయి అవార్డు దక్కింది

ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని కొవ్వూరుకి చెందిన ప్రసాద్ గా గుర్తించారు. ఏదైనా పని వెతుకుంటూ జీవనం సాగించడానికి వారం రోజుల క్రితం ఇనాంగూడా వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చినపుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం అతివేగంతో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ స్పాట్ లోనే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.