'త్రినయని' సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య..!

'త్రినయని' సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య..!

నాలుగు రోజుల కిందట త్రినయని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల కిందట త్రినయని నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సహనటుడు చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడం సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. 

పవిత్రతో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్‌నగర్ జిల్లా శేరిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అదే కారులో ఉన్న చంద్రకాంత్ గాయాలతో బయటపడ్డాడు. ఇదిలా ఉండగా, చంద్రకాంత్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ పరిధి అల్కాపూర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకోవడంతో అనుమానంతో ఫ్లాట్‌కు వచ్చిచూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. 

Read More తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కీలక ప్రకటన

కారు ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. పవిత్ర జయరాంతో చంద్రకాంత్ కొంతకాలంగా సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడి తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.