మహిళా వైద్యురాలిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైంగిక వేధింపులు

మహిళా వైద్యురాలిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లైంగిక వేధింపులు

సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అసంక్రిమిత వ్యాధుల నియం త్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని సూర్యాపేట కు చెందిన మహిళా డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

విశ్వంభర, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో లైంగిక వేధింపులు కలకలం సృష్టిస్తున్నాయి. మహిళా డాక్టర్‌పై తోటి వైద్యుడు వేధింపులకు పాల్పడుతుండటం జిల్లాలో సంచలనంగా మారింది. అతడి టార్చర్ భరించలేక బాధిత వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్,అసంక్రిమిత వ్యాధుల నియం త్రణ అధికారి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి ఆలన విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా డాక్టర్ పై గత కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. డ్యూటీలో ఉన్న సమయంలో అసభ్యంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. కల్యాణ్ చక్రవర్తి వేధింపులపై గతంలోనే డీఎంహెచ్‌వోకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన కళ్యాణ్ చక్రవర్తి నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను, నీ భర్తను చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా లైంగిక వేధింపులను తీవ్రతరం చేశాడు. దీంతో విసిగిపోయిన మహిళా వైద్యురాలు ఈనెల 28న సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కళ్యాణ్ చక్రవర్తి నుంచి రక్షణ కల్పించి, అతడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

కాగా, తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న కళ్యాణ్ చక్రవర్తి లాంగ్ లీవ్స్ పెట్టుకోని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు విషయంపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  డీఎంహెచ్ఓకు నోటీసులు పంపించారు. 

 

Related Posts