వనపర్తిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..!

వనపర్తిలో బీఆర్ఎస్ నేత దారుణ హత్య..!

వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. గుర్తుతెలియని దుండగులు శ్రీధర్ రెడ్డిని అతికిరాతకంగా నరికి చంపారు.  

వనపర్తి జిల్లాలో ఓ బీఆర్ఎస్ నేత దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా నరికి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌రెడ్డి (45) బుధవారం రాత్రి ఆరుబయట నిద్రించాడు. 

గుర్తుతెలియని దుండగులు శ్రీధర్ రెడ్డిని అతికిరాతకంగా నరికి చంపారు.  అయితే గురువారం తెల్లవారుజామున కుటుంబసభ్యులు చూసేసరికి దారుణ హత్యకు గురైనట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. మృతుడు శ్రీధర్‌రెడ్డి కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్‌రెడ్డికి ప్రధాన అనుచరుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read More చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం : ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి

ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్లు విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలల్లోనే దాడులు పెరిగాయన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి స్పందిస్తూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయన్నారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.