BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులు..!

BREAKING: తెలంగాణ డీజీపీ పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులు..!

తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమాయకులను మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని బెదిరించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల ఫొటోతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ డీజీపీ రవి గుప్తా పేరుతో వాట్సాప్‌లో బెదిరింపులకు పాల్పడటం కలకలం రేపింది. అమాయకులను మాదకద్రవ్యాల కేసులో ఇరికిస్తామని బెదిరించి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. 

‘రూ.50వేలు ఇస్తే.. నిన్ను కేసు నుంచి తప్పిస్తాం’ అంటూ నమ్మిస్తున్నారు కేటుగాళ్లు. డీజీపీ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి హైదరాబాద్‌లోని ఓ వ్యాపారవేత్తకు వాట్సాప్ కాల్ చేశాడు అగంతకుడు. అతడి కూతురుకు సైతం ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ముందుగా వారిని మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించేందుకు రూ.50వేలు డిమాండ్ చేశారు. 

Read More బిగ్ బ్రేకింగ్ - కవితకు బెయిల్

అనుమానం వచ్చి ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దుండగుడు చేసిన వాట్సాప్ కాల్ +92 కోడ్‌తో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెంబరు పాకిస్తాన్ కోడ్ అని సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.