పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డ్ ఇంటిపై దాడి...!

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డ్ ఇంటిపై దాడి...!

పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై కొంద‌రు దుండగులు దాడికి పాల్ప‌డ్డారు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో ఉన్న వెంకట్ ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.

జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ పర్సనల్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై కొంద‌రు దుండగులు దాడికి పాల్ప‌డ్డారు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని లెనిన్ నగర్‌లో ఉన్న వెంకట్ ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. పాత కక్షలతోనే రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న బైక్‌కు నిప్పుపెట్టి ఇంటిపై రాళ్లతో దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది.

కాగా, వెంకట్ తన భార్య సరిత, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో కలసి ఐదేళ్లుగా లెనిన్ నగర్‌లో నివాసముంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఇంటి ఎదురుగా ఉండే రాజు వారి బంధువులు పాత గొడవల నేపథ్యంలో ఈనెల 15న‌ రాత్రి ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఇంటి ప‌క్క‌న‌ ఉండే ఓ యువకుడు వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో వెంకట్ భార్య సరిత ఆ యువకుడిని కొట్టడంతో వివాదం మొదలైంది.  

అదేవిధంగా మే 15వ తేదీన వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్‌లతో దాడి చేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్ప‌పడ్డారు. దీంతో వెంక‌ట్ త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మీర్‌పేట్ పోలీసుల‌ను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Posts