హైదరాబాద్‌లో కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌లో కత్తులతో పొడిచి వ్యక్తి దారుణ హత్య

  •    రౌండప్ చేసి రాళ్లు, కర్రలతో దాడి
  •    బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఘటన

ఇటీవల చిన్నపాటి గొడవలకు విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని వెంబడించి కత్తులతో అతిదారుణంగా హత్య చేశారు. బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తిని ముగ్గురు రౌండప్ చేసిన దుండగులు కత్తులతో పొడిచారు. విచక్షణారహితంగారాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఉంటున్న సమీర్ (28) అనే యువకుడిని పలువురు దుండగులు వెంబడించారు. సమీర్ చిక్కగానే అందరూ రౌండప్ చేశారు. అందులో ఓ వ్యక్తి కత్తితో సమీర్‌ కడుపుతో పొడిచాడు. మరో ఇద్దరు అతడిని రాళ్లు, కర్రలతో దారుణంగా కొట్టారు. దీంతో సమీర్ అక్కడికక్కడే మృతిచెందాడు.

Read More ఘనంగా  సోమిడి తాళ్లపద్మావతీ ఒలంపియాడ్ స్కూల్లో స్కిన్ టిల్లా 2025 వేడుకలు 

హత్య అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్యా సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ హత్యకు పాతకక్షలే కారణమా లేక ఆర్థిక వ్యవహారమా? మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేస్తున్నారు.