మరోసారి బెంగుళూర్ కు బాంబు బెదిరింపులు

మరోసారి బెంగుళూర్ కు బాంబు బెదిరింపులు

విశ్వంభర, బెంగుళూరు : కర్ణాటక రాజధాని బెంగుళూర్ కు మరోసారి బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. బెంగుళూర్ లోని ప్రముఖ హోటల్ ఒట్టేరా సహా మరో రెండింటికి బెదిరింపులు వచ్చాయి. ఆయా యాజమాన్యాలకు ఒక ఈ ‌మెయిల్ నుంచి హాటళ్లు పేల్చివేస్తామంటూ హెచ్చరికలు రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి తనిఖీలు ముమ్మరంగా చేపట్టాయి. వీటి సమీప ప్రాంతాల్లో భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. ఇంతవరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని..  తనిఖీలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

Read More గుంటూరుపల్లి గ్రామంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న వృద్ధ దంపతుల ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

Related Posts