చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తారా..?

చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తారా..?


గురు, శిష్యుల బంధం మరింత పటిష్టం
ఆ సమస్యలు తీరుస్తారా


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మిత్ర బృందమే అధికారంలో ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అటు ఏపీలో కూడా చంద్రబాబు సీఎం కాబోతున్నారు. వీరద్దరూ గతంలో కలిసి పని చేసిన వారే. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ కు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ పార్టీనే. చంద్రబాబు సపోర్టుతోనే రేవంత్ ఎదిగారనే వాదన ఉంది. 

Read More జాబ్ మేళాలో 14 మంది ఎంపిక

ఈ క్రమంలోనే ఇప్పుడు తన అభిమాన నాయకుడు చంద్రబాబు సీఎం కాబోతుండటంతో స్వయంగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు. చంద్రబాబు పిలిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తానంటూ ఆయనే స్వయంగా చెప్పారు. అంటే చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి రేవంత్ సిద్ధంగా ఉన్నారనేది అర్థం అవుతోంది. 

ఈ క్రమంలోనే వీరిద్దరూ మున్ముందు కలిసి పనిచేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని పోటీ చేయిచంకుండా రేవంత్ కు సహకరించారని అంటారు. కాబట్టి వీరిద్దరూ రాజకీయంగా అటు రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఒకరికొకరు సహకారం అందించుకుంటారని అంటున్నారు. 

రెండు రాష్ట్రాల నడుమ ఉన్న నీటి పంచాయితీని తీరుస్తారని అందరూ ఆశగా ఉన్నారు. దాంతో పాటు రెండు రాష్ట్రాల నడుమ ఉన్న చాలా పెండింగ్ సమస్యలను వీరిద్దరూ పరిష్కరించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతో పాటు ఒకరికి ఒకరు రాజకీయంగా సపోర్టు చేసుకుంటారని తెలుస్తోంది. మరి వీరిద్దరూ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.