చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ

చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ

ఈనెల 12వ తేదీ(బుధవారం) ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సమయం మారిందని 9.27గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈనెల 12వ తేదీ(బుధవారం) ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సమయం మారిందని 9.27గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 

ఏపీ సీఎంవో పేరుతో వచ్చిన ఆ ట్వీట్‌తో అంతా సమయం మారిందని అనుకున్నారు. ఈ నేపథ్యంలో అలాంటిదేం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంవోచేసిన ట్వీట్‌లో తప్పిదం జరిగిందని వెల్లడించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈనెల 12వ తేదీన ఉదయం 11.27గంటలకే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అమరావతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే వేదికను గన్నవరానికి మార్చినట్లు ఏపీ సీఎంవో పేర్కొంది. 

Related Posts