చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్

చంద్రబాబుకు ప్రధాని మోడీ ఫోన్

అభినందనలు తెలిపిన మోడీ, అమిత్ షా

త్వరలో మనం కలుద్దామన్న అమిత్ షా

నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం

టీడీపీ నేత చంద్రబాబు నాయుడికి బీజేపీ అగ్రనేతలు అభినందనలు తెలిపారు. ఏపీ ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో వైపీసీపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏపీలో విజయ ఢంకా మోగించి.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే దేశ వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 300 సీట్లలో మెజార్టీ దిశగా వెళుతోంది. దీంతో పరస్పరం వారు అభినందనలు చెప్పుకున్నారు. త్వరలోనే కలుసుకుందామని అమిత్ షా చంద్రబాబుకు చెప్పారు. వైసీపీ ఓటమి బాధలో ఉండగా టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరోవైపు జూన్ 9న చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

Related Posts