ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్‌ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ జగన్‌కు ఓటమి ఖాయమన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (మంగళవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో వైఎస్ జగన్‌కు ఓటమి ఖాయమన్నారు. గతంలో జూన్ 4న జగన్‌కు దిగ్భ్రాంతికి కలిగించే ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించిన ప్రశాంత్ కిశోర్.. తాజాగా తన వ్యాఖ్యలను పునరుద్ఘాటించారు. 

పదేళ్లుగా ఎన్నికల స్ట్రాటజిస్టుగా చేస్తున్నాననీ... దేశంలో ఎక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారనేది తాను అంచనా వేయగలనని చెప్పారు. జగన్ పార్టీ విషయంలోనూ తన అంచనాలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా నేనే గెలుస్తా అంటున్నారని అన్నారు. అయితే, జగన్ మాత్రం లాస్ట్‌ టైమ్‌ కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటున్నారని పేర్కొన్నారు. రేపు కౌంటింగ్‌ సగం అయ్యేవరకు కూడా జగన్ అదే మాట చెబుతారని తెలిపారు. రాసిపెట్టుకోండి.. ఫలితాలు చూసి జగన్ షాక్‌ తింటాడని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.

Read More హైదరాబాదులో ఎన్ఐఏ తనిఖీల కలకలం

Related Posts