పవన్ గెలుపు.. అన్నా లెజనోవా ఫుల్ హ్యాపీ!

పవన్ గెలుపు.. అన్నా లెజనోవా ఫుల్ హ్యాపీ!

70 వేల మెజార్టీతో భారీ విజయం

పవన్ ఇంటి వద్ద అభిమానుల సందడి

అభిమానులకు అన్నా లెజనోవా అభివాదం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన 70 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు. దీంతో ఈసారి పిఠాపురం నుంచి మెజారిటీతో గెలిచి మొదటి సారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఏపీలో కూటమి భారీ స్థాయిలో విజయం సొంతం చేసుకోగా.. జనసేన నిలబడ్డ 21 సీట్లలో 20 సీట్లు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో జనసేన పార్టీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పవర్ స్టార్ విజయంతో పాటు.. దాదాపు 20 సీట్లు సాధిస్తోన్న జనసేనకు అన్ని వర్గాల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అంతే కాదు మెగా ప్యామిలీతో పాటు.. ఇండస్ట్రీలో నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా సంతోషం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని పవన్ నివాసం బయట అభిమానులు, కార్యకర్తలకు వచ్చి సెలబ్రేషన్స్ చేస్తుండటంతో ఆయన భార్య అన్నా లెజినోవా, తనయుడు అకిరా నందన్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. పవన్ కళ్యాణ్‌ని గెలిపించినందుకు జనసేన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

Related Posts