ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్.. సినిమా రేంజ్ ఛేజింగ్!

ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్.. సినిమా రేంజ్ ఛేజింగ్!

ఈవీఎంలు ద్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. సినిమా రేంజ్‌లో చేజ్ చేసి పోలీసులు ఆయన్ని పట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని బాత్రూమ్ షింకులు, కమ్ బోర్డులు తయారు చేసే కంపెనీలో పిన్నెల్లి సోదరులు దాక్కున్నారు. పక్కా సమాచారంతో వెళ్లిన పోలీసులు పిన్నెల్లి సోదరలను అదుపులోకి తీసుకున్నారు. అంతకంటే ముందు సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారాన్ని తెలుసుకున్న పిన్నెల్లి సోదరులు మొబైల్ కారులో వదిలి పారిపోయారు. అప్పటి నుంచి గాలింపు చర్యలు వేగవంతం చేశారు. 

 

Read More బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ఎమ్మెల్యేపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అన్ని ఎయిర్ పోర్టులను ఏపీలో పోలీసులు అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పిన్నెల్లి తలదాచుకున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో.. వెంటనే కొన్ని బృందాలు ఆయన కోసం జల్లెడ పట్టాయి. ఇస్నాపూర్ సమీపంలోని బాత్రూమ్ షింకులు, కమ్ బోర్డులు తయారు చేసే కంపెనీలో ఇద్దరి అరెస్ట్ చేశారు. అయితే పిన్నెల్లి అరెస్ట్ పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. 

 

Read More బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

పిన్నెల్లి ఈవీఎంలు ద్వంసం చేసినట్టు వీడియోలు బయటకు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో.. ఆయనపై మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదయ్యాయి. IPC కింద 143, 147, 448 427, 353, 452, 120b సెక్షన్లు పెట్టారు. ఇక PD PP చట్టం కింద మరో కేసు నమోదైంది. ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లు నమోదు చేశారు.

Tags:

Related Posts