తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ హబ్

ఐఐటీ - ఐసర్‌ల భాగస్వామ్యంతో సరికొత్త ఆవిష్కరణలు

తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ హబ్

ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వేదికగా 'ఏపీ ఫస్ట్' (ఫ్యూచరిస్టిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) పేరుతో ఒక భారీ అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి వేదికగా 'ఏపీ ఫస్ట్' (ఫ్యూచరిస్టిక్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ) పేరుతో ఒక భారీ అంతర్జాతీయ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. రాష్ట్రంలోని యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని చంద్రబాబు తెలిపారు.

ఈ రీసెర్చ్ సెంటర్ కేవలం ఒక కార్యాలయంలా కాకుండా, విజ్ఞాన గనిలా పని చేయనుంది. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీ-తిరుపతి, ఐసర్‌ భాగస్వామ్యంతో దీనిని నిర్మించనున్నారు. ఈ రీసెర్చ్ సెంటర్‌లో అత్యాధునిక సాంకేతికపై పరిశోధనలు చేయనున్నారు. కొత్త రకమైన స్టార్టప్‌లకు, ఆవిష్కరణలకు ఊతమివ్వనుంది. కేవలం పరిశోధనలే కాకుండా, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు నేర్పించనుంది.

Read More లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "రాష్ట్ర భవిష్యత్తు విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థపైనే ఆధారపడి ఉంది. తిరుపతిలో ఏర్పాటు చేయబోయే ఈ సెంటర్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుంది. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో మన యువతే దిక్సూచి కావాలి" అని వెల్లడించారు. ఈ కేంద్రం ఏర్పాటుతో చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగానే కాకుండా, దక్షిణ భారతదేశపు 'నాలెడ్జ్ హబ్'గా కూడా అవతరించబోతోంది.

Tags: AP cm