CM Jagan: చరిత్ర సృష్టించబోతున్నాం.. ప్రశాంత్ కిశోర్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందన..! 

CM Jagan: చరిత్ర సృష్టించబోతున్నాం.. ప్రశాంత్ కిశోర్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందన..! 

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయాన్ని సొంతం చేసుకున్న జగన్‌కు ఈ సారి ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. 

విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. దాదాపు అరగంట సేపు ఐప్యాక్ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీలో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

Read More  రెడ్ బుక్ అంటే ఉలికిపాటు ఎందుకు జగన్? - జగన్ కు దమ్ముంటే .. శాసనసభకు వచ్చి  వాస్తవాలను ప్రకటించాలి 

మనం చరిత్ర సృష్టించబోతున్నామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిశోర్ ఆలోచించలేనన్ని సీట్లు తమకు వస్తాయని తెలిపారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాల తర్వాత యావత్ దేశం మనవైపు చూస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ, ఐప్యాక్ ప్రయాణం ఇలాగే ముందుకు సాగుతుందని అన్నారు.

Related Posts