జగన్ కు గౌరవం ఇవ్వండి.. సీఎం చంద్రబాబు
మాజీ సీఎం జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచే జగన్ మీద సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక తాజాగా జగన్ కు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు.
దాంతో సాధారణ వ్యక్తిగానే జగన్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ గేటు బయటనే జగన్ కారు దిగి లోపలకు నడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఇది గమనించిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేటు లోనికి జగన్ కారును రానివ్వాలంటూ అధికారులను ఆదేశించారు.
మాజీ సీఎంగా జగన్ కు గౌరవం ఇవ్వాలంటూ తెలిపారు. ఇక ప్రతిపక్షం విషయంలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. రాగద్వేషాలకు ఏ మాత్రం తావు ఇవ్వొద్దని.. అసెంబ్లీలో అయినా.. బయట అయినా చాలా హుందాగానే వ్యవహరించాలంటూ తెలిపారు.



