పేరు మార్చుకుంటున్నా.. ముద్రగడ సంచలన ప్రకటన
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వైసీపీకి కోలుకోని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని తెలిపారు. పేరు మార్చుకునేందుకు గెజిట్ పబ్లికేషన్ పేపర్లు సిద్ధం చేసుకుని మీడియాకు చూపించారు.
రెండు, మూడు రోజుల్లో తన పేరు మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలిపారు. ఏపీ ప్రజల సంక్షేమానికి కోట్లాది రూపాయలు అందించింది సీఎం జగన్ మాత్రమేనని ముద్రగడ తెలిపారు. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదో తెలియడంలేదన్నారు. ప్రజల కోసం కష్టపడిన జగన్‌ను ప్రజలు గౌరవించకపోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక ముందు కూడా జగన్‌తోనే కొనసాగుతుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.