స్థానిక సమరంపై చంద్రబాబు ఫోకస్.. తెలంగాణలో పోటీకి సన్నద్ధం

స్థానిక సమరంపై చంద్రబాబు ఫోకస్.. తెలంగాణలో పోటీకి సన్నద్ధం

లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు.

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార వైసీపీ, టీడీజీ-బీజేపీ-జనసేన కూటమికి మధ్య పోటీ బాహాబాహీగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు.

హైదరాబాద్‌లో శుక్రవారం టీటీడీపీ నాయకులతోసమావేశమయ్యారు చంద్రబాబు. ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. ఇక నుంచి ఏపీతో పాటు తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని చంద్రబాబు చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా స్థానిక సమరానికి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.

Read More పయనీరింగ్ ఎక్సలెన్స్‌తో వజ్రా ఈవెంట్స్ 13వ వార్షికోత్సవం