ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిని వదిలిపెట్టం: సీఈవో ఎంకే మీనా

ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిని వదిలిపెట్టం: సీఈవో ఎంకే మీనా

పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని సీఈవో ఎంకే మీనా స్పష్టం చేశారు. ఈ ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టమని సీఈవో ఎంకే మీనా స్పష్టం చేశారు. ఈ ఘటనలో సరైన సమాచారం ఇవ్వనందుకు విధుల్లో ఉన్న పీవో, ఏపీవోలను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

ఈ కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు ఎస్పీ, డీఎస్పీలతో ఎనిమిది పోలీసు బృందాలు పనిచేస్తున్నాయన్నారు. మాచర్ల నియోజకవర్గంలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్లటం ఇప్పుడు మంచిది కాదన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నాయని తెలిపారు. 

బయటి నుంచి నేతలెవరూ పరామర్శకు వెళ్లొద్దని సూచించారు. ఎవరినీ ఆ గ్రామాలకు వెళ్లనీయొద్దని సూచనలు జారీ చేశామని చెప్పారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదని తెలిపారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వచ్చాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించేందుకు రాష్ట్రంలో పర్యటిస్తామని సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.

Related Posts