BIG BREAKING : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీడీపీ విజయోత్సావంలో మంత్రి తుమ్మల

BIG BREAKING : కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. టీడీపీ విజయోత్సావంలో మంత్రి తుమ్మల

  • కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకిచ్చిన మంత్రి తుమ్మల
  • టీడీపీ విజయోత్సవంలో పాల్గొన్న నాగేశ్వర్ రావు
  • ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వెళ్లిన తుమ్మల

విశ్వంభర, ఖమ్మం : ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ టీడీపీ కేడర్ సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో సహ జిల్లాల్లోనూ తెలుగు తమ్ముళ్లు టపాసులు కాలుస్తూ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీ ఆఫీసుకు వెళ్లడం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగుతూ ప్రత్యర్థి టీడీపీ ఆఫీసుకు వెళ్లడం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాగా, తుమ్మల సహా సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో టీడీపీలోనే కొనసాగారు. తుమ్మల నాగేశ్వర్ రావు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పని చేశారు. ఈ సాన్నిహిత్యంతోనే తుమ్మల టీడీపీ ఆఫీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది.