దావోస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
నాలుగు రోజుల్లో 36 భేటీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'-2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం ఆదివారం బయలుదేరి వెళ్లనుంది.
విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ విదేశీ పర్యటనకు శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 'వరల్డ్ ఎకనామిక్ ఫోరం'-2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం ఆదివారం బయలుదేరి వెళ్లనుంది. పారిశ్రామిక దిగ్గజాలను కలిసేందుకు, రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు అత్యంత కట్టుదిట్టమైన ప్రణాళికతో సిద్ధమయ్యారు.
సదస్సులో బాబు-లోకేష్ జోరు
ఈ అంతర్జాతీయ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం మూడు కీలక సెషన్లలో ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా 'ట్రిలియన్ డాలర్ల ఏఐ ఎకానమీ' మరియు 'పునరుత్పాదక ఆహార వ్యవస్థలు' అనే అంశాలపై ఆయన ప్రసంగం సాగనుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండు సెషన్లలో ప్రసంగించనున్నారు. 'పీ4' (పబ్లిక్ ప్రైవేట్ పీపూల్ పార్టనర్‌షిప్) మోడల్, రాష్ట్రంలో సాగుతున్న డిజిటల్ విప్లవం గురించి వివరించనున్నారు.
నాలుగు రోజుల పర్యటనలో ముఖ్యమంత్రి దాదాపు 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, ఏపీ మోలర్ మేర్క్స్ సీఈవో విన్సెంట్ క్లెర్క్‌లతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై ఏపీలో వారి పెట్టుబడుల విస్తరణపై చర్చించనున్నారు. స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి, యూఏఈ వాణిజ్య ప్రతినిధులు, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిరన్ బర్కత్ వంటి కీలక నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దావోస్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ లాంజ్ వేదికగా 'వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్' వంటి వినూత్న కార్యక్రమాలపై అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రధానంగా మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నెల 19 నుంచి 22 వరకు అత్యంత బిజీగా గడపనున్న సీఎం బృందం, 23న పర్యటన ముగించుకుని నేరుగా అమరావతికి చేరుకుంటుంది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి కనీసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.



