800 మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్.. భారీ ఎన్‌కౌంటర్

800 మంది పోలీసులతో సెర్చ్ ఆపరేషన్.. భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఐదుకి చేరు అవకాశం ఉందని సమాచారం. మావోయిస్టుల కోసం భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అబూజ్‌మడ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో 800 మంది పోలీస్ బలగాలతో ఆపరేషన్ జరుగుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది.

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ ఐదు నెలలుగా సాగుతోంది. పోలీసులు మావోయిస్టుల ఏరివేతకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడంలేదు. ఐదు నెలల్లో దాదాపు 27 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్లలో 107 మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టు పార్టీ చెబుతోంది. ఇవాళ మరోసారి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 

 

Read More ఘనంగా కబడ్డీ పోటీలు

ఓవైపు ఎదురు తిరుగుతున్న మావోయిస్టులను హతమార్చుతూనే.. మరోవైపు నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం, హోంమంత్రి విజయ శర్మ నక్సలైట్లకు బహిరంగ పిలుపునిస్తూ లేఖ రాశారు. నక్సల్ పునరావాస విధానంలో మార్పు కోసం నక్సలైట్‌ల నుండి ప్రభుత్వం సూచనలు కోరుతుందని చెప్పారు. ప్రభుత్వం ముందు లొంగిపోయే నక్సలైట్లు తమ వివరాలు తెలిపేందుకు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఈమెయిల్ ఐడీ, గూగుల్ ఫామ్‌ను విడుదల చేశారు.

Related Posts