ఘనంగా చక్రవర్తి వైద్యశాలలో వరల్డ్ రేడియోగ్రఫీ డే
విశ్వంభర, హనుమకొండ జిల్లా :-హనుమకొండ జిల్లా ఏకశిలా పార్క్ సమీపంలో ఉన్న చక్రవర్తి వైద్యశాలలో రేడియోగ్రఫీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అరికిల్ల సుమన్ ఆధ్వర్యంలో రేడియాలజీ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చక్రవర్తి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి కేక్ కటింగ్ చేయడం జరిగింది. తదనంతరం డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతి హాస్పిటల్ లో ఒక రోగాన్ని కనుక్కోవడం అనేది చాలా ముఖ్యం అందులో రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అని అన్నారు. డాక్టర్ రోగనీ నయం చేయాలంటే మొదటగా పేషెంట్ యొక్క రోగాన్ని ఫస్ట్ నిర్ధారణ చేయాలి.అదే రేడియాలజీ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య లక్ష్యం అని తెలిపారు. ఎంతోమంది బీద ప్రజలకు సేవలు అందిస్తున్న రేడియో గ్రాఫి డిపార్ట్మెంట్ అవడం చాలా సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తాళ్లపల్లి జయరాజ్ చిర్లగోని అశోక్ ప్రతాప్ రేవంత్ గండిరాజు గుర్రం రాకేష్ కుక్కల ప్రవీణ్ గారి వెంకటేష్ బొల్లం నాగరాజు అల్లి రజనీకాంత్ ఎల్లూరి రాజు చిరుమల రంజిత్ కుమార్ సంఘ శశాంక్ బూడిద నవీన్ మాచర్ల కర్ణాకర్ అంది తరుణ్ అట్టింగుల శివాజీ మాదాసి తరుణ్ తదితరులు పాల్గొన్నారు.



