చంద్రబాబు ఇంట సంబురాలు.. కేక్ కట్ చేసిన మనవడు
On
- చంద్రబాబు నివాసంలో అంభరాన్ని అంటిన సంబురాలు
- కేక్ కట్ చేసిన చంద్రబాబు మనవడు దేవాన్ష్
- హాజరైనా నారా, నందమూరి ఫ్యామిలీస్
విశ్వంభర, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. టీడీపీ కూటమి ఏపీలో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల శ్రేణులు విజయోత్సవ సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీకి కాబోయేసీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఇంట్లో విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కుటుంబ సభ్యుల నడుమ కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి... తాతకు, బంధువులకు కేక్ తినిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More ముగిసిన బ్రహ్మోత్సవాలు