వరలక్ష్మి రూపంలో వాసవి మాత అలంకరణ - ఆలయ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్
ఆగస్టు 15న వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
విశ్వంభర, వరంగల్:- వరలక్ష్మీ
శుక్రవారం సందర్భంగా ములుగు రోడ్డు లోని శ్రీ వాసవి మాత దేవాలయం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో అలంకరించడం జరిగిందని ఆలయ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 108 కలశాలతో గంధంతో అభిషేకము మరియు సామూహిక కుంకుమార్చన, అన్న ప్రసాద వితరణ జరిపినట్లు తెలిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. ఆగస్టు 15వ తేదీన శుక్రవారం లక్ష గాజుల పూజ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించడం జరుగుతుందన్నారు. ఆలయం నిర్మించినప్పటి నుండి నాలుగోసారి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భాగస్వామ్యం కావడం కోసం 12 జిల్లాల నుండి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇందులో సుమారు 1500 మంది మహిళలు పాల్గొనడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి మహిళకు 5 డజన్ల గాజులు, అమ్మవారి ఫోటో, కుంకుమ ప్రసాదాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభంలో సంకల్పంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల గోత్రనామాలు చదవడం జరుగుతుందన్నారు. 150 రూపాయల టికెట్ ధరను నిర్ధారించామని దీనిలో భాగంగా భక్తులకు రిటర్న్ గిఫ్టుగా గాజులు కుంకుమ అమ్మవారి ఫోటో ప్రసాదాలు అందజేస్తామని అని పేర్కొన్నారు. ఉదయం అమ్మవారి పూజ ప్రారంభం తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు వాట్స్అప్ ద్వారా ఒరిజినల్ రిసిప్ట్ ను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా హనుమకొండ నయన్ నగర్ లోని కీర్తి ఆసుపత్రి యాజమాన్యం సౌజన్యంతో మహిళలకు ప్రసూతికి సంబంధించిన ప్రత్యేక వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భక్తులకు భోజన ఏర్పాట్లు కూడా ఆలయంలోనే ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని ముకుందా జ్యువెలర్స్, కీర్తి హాస్పిటల్ శివ గణేష్ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందన్నారు. వాసవి మాత చారిటబుల్ ట్రస్ట్ తో పాటు వాసవి మాత మిత్రమండలి, వాసవి సేవా కేంద్రం సభ్యులతో ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.



