ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పదంగా మృతి...ఎక్కడంటే...?
On
విశ్వంభర, కర్నూల్ : ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఆదివారం కర్నూల్ సమీపంలోని గార్గేయపురం చెరువు వద్ద వెలుగులోకి వచ్చింది. చెరువులో మొదట ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా... చెరువు ఒడ్డున మరో మృతదేహాన్ని గుర్తించారు. అయితే వీరి శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులు ఎవరు? ఎలా చనిపోయారు? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లను తీసుకువచ్చి మృత దేహాలను గుర్తుపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.