యువజన కాంగ్రెస్ నేతలకు పదవుల్లో కోటా ఇస్తాం : కే ఎల్ ఆర్
- సామాజిక సేవ చేసేవాడే నాయకుడు
- యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే రాహుల్, సీఎం రేవంత్ ఆలోచన
- నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
విశ్వంభర, మహేశ్వరం: తుక్కుగూడ యువజన కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులతో పాటు నామినేటడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. తుక్కుగూడ కే ఎల్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు వల్లబు సూభాన్ యాదవ్ సహా మండల యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి కే ఎల్ ఆర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పదవులు ఆశించే యువకులు ప్రజా సేవ చేసి సేవకుడే నాయకులు మారాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో కోటా ప్రకారం యూత్ కు అన్ని రంగాల్లో పదవులు, నామినేటడ్ పోస్టులు ఇచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేఎల్ఆర్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు యువరక్తం ఎక్కించాలన్నదే అగ్రనేతల లక్ష్యామని తెలిపారు. సమాజ సేవ చేసేందుకు నేటి యువత ముందుండాలని కిచ్చెన్న కోరారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక సమీకరణలు పాటించి పదవులు ఇస్తుందన్నారు లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్థన్ రెడ్డి జన్మదినం సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు కేఎల్ఆర్. యూత్ కాంగ్రెస్ కందుకూర్ అధ్యక్షులు వెంకటేశ్ గౌడ్. మహేశ్వరం మండల అధ్యక్షులు గొల్లూరి రాజు, బాలాపూర్ మండలం అధ్యక్షులు రవికాంత్ రెడ్డి, సరూర్ నగర్ మండలం అధ్యక్షులు యూనస్ సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.



