శివాని మహిళా కళాశాలలో యోగా వేడుకలు.
విశ్వంభర, ఎల్బీనగర్ : ప్రపంచ యోగ దినోత్సవము సందర్భంగా కొత్తపేటలోని శివాని మహిళా కళాశాలలో యోగా దినోత్సవంను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పి. రామ్ రెడ్డి, కరస్పాండెంట్ వెదిరే సుదర్శన్ రెడ్డి లు తెలిపారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే సంపూర్ణ సాధనం" అని ఆయన అన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి, ఏకాగ్రత పెరుగుతుందని చెప్పారు. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా, విద్యార్థులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచి చదువులో మెరుగైన ఫలితాలు సాధించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు కూడా యోగా సాధన చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా జీవించవచ్చని సూచించారు. యోగ మాస్టర్ నగేష్ యోగాసనాలను విద్యార్థులచే చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిత, విద్యార్థినిలు పాల్గొన్నారు.



